Mehul Choksi:మెహుల్‌ చోక్సీ అరెస్ట్‌..

3
- Advertisement -

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రుణ మోసం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీని పోలీసులు బెల్జియంలో అరెస్ట్ చేశారు. చోక్సిని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు గతకొంతకాలంగా ప్రయత్నిస్తున్నాయి. ముంబయి కోర్టు జారీ చేసిన రెండు అరెస్టు వారెంట్ల ఆధారంగా అరెస్టు చేసినట్లు సమాచారం.

మెహుల్‌ చోక్సీ ఆరోగ్యం సరిగా లేదని.. దాంతో ఆయనను ఎక్కువ రోజులు జైలులో ఉండే అవకాశం లేదని.. కోర్టు బెయిల్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.13,500కోట్ల రుణ మోసం కేసులో మెహుల్‌ చోక్సీ సైతం నిందితుడిగా ఉన్నారు. ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ సైతం ఈ కేసులో నిందితుడు. ఆయన లండన్‌లో ఉండగా.. భారత్‌కు రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది.

Also Read:ఇంటర్‌ తర్వాతే టెన్త్ రిజల్ట్స్!

- Advertisement -