విక్టీరి వెంకటేష్ గతంలో సినిమా తర్వాత ఇంత వరకు ఎలాంటి సినిమాలు చేయలేదు. తేజ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నాడన్న వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. కానీ ఆ సినిమా ఇంత వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఇక ప్రస్తుతం పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో జోరుమీదున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.
ఆయన డైరెక్షన్‌లో ఓ మల్టీస్టారర్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఇత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు దిల్ రాజు. గతంలో వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన అనుభం కూడా అతనికుంది. ఇక ఇప్పుడు చేయబోయే మల్టీస్టారర్‌లో వరుణ్ తేజ్, వెంకటేష్ కలిసి నటించనున్నారు.
వీరిద్దరు కలిసి నటిస్తుండటంతో హీరోయిన్ల ఎంపిక విషయంలో గతంలో వాళ్లు వీళ్లు అంటూ చాలా వార్తలు వినిపించాయి. ఈ వార్తలన్నింటికి పుల్ స్టాప్ పెడుతూ తాజాగా అధికారికంగా ప్రకటించాను దిల్ రాజు. వెంకికి జోడిగా మిల్క్ బ్యూటి తమన్నాను ఎంపిక చేయగా వరుణ్ తేజ్‌కు జోడిగా మెహరీన్‌ను ఎంపిక చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు నిర్మాత దిల్ రాజు. ఇక ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానుట్లు ప్రకటించారు నిర్మాత.