మేఘాంశ్ శ్రీహ‌రి, నందు మ‌ల్లెల కాంబినేష‌న్‌లో సి.క‌ళ్యాణ్ చిత్రం

52
srihari

లెజెండ్రీ న‌టుడు, స్వ‌ర్గీయ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ శ్రీహ‌రి క‌థానాయ‌కుడిగా రూపొంద‌నున్న మూడో చిత్రం ‘రాసిపెట్టుంటే’.సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ సీనియ‌ర్ నిర్మాత సి.క‌ళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ డిఫ‌రెంట్ మూవీని నందు మ‌ల్లెల డైరెక్ట్ చేస్తున్నారు.

ఆదివారం(ఆగ‌స్ట్‌15) రోజున శ్రీహ‌రి జ‌యంతి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఓ సాయంత్ర స‌మ‌యాన‌.. ఓ ప్రాంతంలో ఫెన్సింగ్ వేసి ఉన్నారు. దానికి అవ‌త‌ల వైపు రోడ్డుపై ఓ బ‌స్సు వెళుతుంది. ఈ అంశాల‌తో డిఫ‌రెంట్‌గా, ఆక‌ట్టుకునేలా పోస్ట‌ర్ ఉంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ఈ సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియజేసింది.

న‌టీన‌టులు:
మేఘాంశ్ శ్రీహ‌రి

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: నందు మ‌ల్లెల‌
నిర్మాత‌: సి.క‌ళ్యాణ్‌
బ్యాన‌ర్‌: సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌