మెగాస్టార్‌ టైటిల్‌తో వస్తున్న మరో హీరో..

390
Bellamkonda Sreenivas
- Advertisement -

యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్టు,ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ యువ హీరో నటించిన చిత్రం సీత. ఈ నెల 25న ఈ మూవీ విడుదల కానుంది. అయితే సీత సినిమా రిలీజ్‌ కాకముందే మరో సినిమాలో నటించడానికి సిద్ధమైయ్యాడు సాయి శ్రీనివాస్‌. దీనికి ‘రాక్షసుడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈమూవీ తమిళంలో వచ్చిన ‘రాచ్చసన్’కి రీమేక్. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది.

అయితే గతంలో చిరంజీవి హీరోగా ‘రాక్షసుడు’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ మధ్య సూర్య అనువాద చిత్రం కూడా ‘రాక్షసుడు’ టైటిల్ తో తెలుగులోకి వచ్చింది. మళ్లీ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకి అదే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అరవై శాతం షూటింగ్ పూర్తయినట్టుగా సమాచారం. వయసుకు వచ్చిన స్కూల్ కెళ్లే ఆడపిల్లలను ఎత్తుకెళ్లి హత్యలు చేసే ఓ అజ్ఞాత హంతకుడి కోసం వెతికే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సాయి శ్రీనివాస్‌ని చాలా పవర్ ఫుల్‌గా చూపించబోతున్నట్టు సమాచారం. ఉగాది రోజున ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది.

- Advertisement -