మెగాస్టార్ ఊ అంటారా ?

40
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి.. సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్న టాప్ స్టార్ హీరో. కెరీర్ తొలినాళ్లలో నెగెటివ్ పాత్రలు కూడా పోషించిన మెగాస్టార్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా మారి.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గా ఎదిగి.. మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని స్థాయికి చేరుకున్నారు. అలాంటి చిరంజీవి ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా ?, అది కూడా తన సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “వాల్తేరు వీరయ్య” సినిమా తర్వాత.. చిన్న దర్శకుడికి చిరు ఛాన్స్ ఇస్తాడా ?,

నిజానికి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తర్వాత, అసలు మెగాస్టార్ చిరంజీవి కి ఏ డైరక్టర్ తో తన తదుపరి చిత్రం చేయాలనేది భేతాళ ప్రశ్నగా మారింది. ఈ వయస్సులోనూ కమర్షియల్ కథలతో వంద కోట్లు అవలీలగా వసూలు చేసే కెపాసిటీ ఉంది చిరుకి. అందుకే నేటికీ కొత్త, పాత అనే తేడా లేకుండా వరసపెట్టి దర్శక,నిర్మాతలు కథలు పట్టుకుని మెగాస్టార్ చిరంజీవి చుట్టూ ప్రదక్షణాలు చేయటం మొదలెట్టారు.

అటు మెగాస్టార్ చిరంజీవి కూడా కమర్షియల్ కథలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో బలగం అనే చిన్న సినిమాతో దర్శకుడిగా హిట్ అందుకున్న వేణుకి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఈ కలయిక మాత్రం ఫిక్స్ అయితే.. కమెడియన్ వేణు మోస్ట్ లక్కీయేస్ట్ డైరెక్టర్ అయినట్టే. అయితే ఎవరూ ఊహించని విధంగా వేణుకి మెగాస్టార్ చిరంజీవి ఊ అంటారా ? డౌటే.

ఇవి కూడా చదవండి…

శ్రద్ధా దాస్..‘పారిజాత పర్వం’

హీరోగా కంటే మంచి మనిషిగా హిట్

Naga Chaitanya:కస్టడీ ఫస్ట్ సింగిల్

- Advertisement -