‘టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ తన తదుపరి చిత్రం మిషన్ ఇంపాజిబుల్
ను నిర్మించింది. చాలా కాలం విరామం తర్వాత తెలుగులో తాప్సీ పన్నుకు ఈ చిత్రం పునఃప్రవేశాన్ని కల్గించింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హై ఎంటర్ టైన్ మెంట్ తోపాటు కొన్ని ఊహించని ట్విస్ట్ లు, కథనంలో వచ్చే మలుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
విడుదలకు ముందే ట్రైలర్, టీజర్కు అద్భుతమైన స్పందన అందుకున్న ఈ చిత్రం మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 30న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హైదరాబాదు వెస్టిన్ హోటల్‌లో బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
నమ్మశక్యంగాని ఓ నిజమైన సంఘటన ఆధారంగా స్వరూప్ తన అద్భుతమైన రచన, టేకింగ్‌తో కమర్షియల్ హంగులు జోడించి ఆకట్టుకునేలా ఈ మూవీని తీర్చిదిద్దాడు. అన్ని కమర్షియల్ అంశాలతోవుంటూ యాక్షన్, థ్రిల్లింగ్ తో కూడిన పూర్తి ఎంటర్టైనర్ గా రూపొందింది. దీపక్ యెరగరా సినిమాటోగ్రాఫర్ కాగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.