మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్

57
- Advertisement -

ప్రముఖ గాయని స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్‌ చిరంజీవి.. ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇండస్ట్రీలో తనకు గాడ్‌ఫాదర్స్‌ లేరని.. కేవలం స్వయంకృషితోనే ఈ స్థాయికి రాగలిగానని అన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అన్న చిరు.. మద్రాస్‌కు వెళ్లిన కొత్తలో ఓ వ్యక్తి తనని చూసి.. ‘నువ్వేం అందగాడివి?’ అంటూ ఎద్దేవా చేశాడని చెప్పారు. ఈ విషయం పై మెగాస్టార్ ఇంకా స్పష్టంగా మాట్లాడుతూ.. ‘నటుడిగా వచ్చిన స్టార్టింగ్ లో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాను. కొన్ని సందర్భాల్లో మానసిక క్షోభకు గురయ్యాను. ఐతే, ఎన్నడూ నా బాధను ఎవరితోనూ పంచుకోలేదు అని చిరు అన్నారు.

చిరు ఇంకా మాట్లాడుతూ.. ‘ఇప్పుడెవరైనా నన్ను విమర్శిస్తే వాటిని పట్టించుకోను.. నవ్వుకుంటాను. కెరీర్‌ ప్రారంభంలో నా మెడలో మా నాన్న వేసిన హనుమంతుడి లాకెట్‌ ఉండేది. అది నన్ను కాపాడుతుందని గట్టిగా నమ్మేవాడిని. ఐతే ఓ సినిమా షూటింగ్‌లో అదెక్కడో పడిపోయింది. ఆ రోజంతా భయాందోళనకు గురయ్యాను. తర్వాత దొరికింది. అని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి మెగాస్టార్ కొత్త ఇంటర్వ్యూ బాగా ఆకట్టుకుంటుంది. పాప్ సింగర్ స్మిత మెగాస్టార్ తో పాటు హీరోయిన్‌ సాయి పల్లవి, దగ్గుబాటి రానా, నారా చంద్రబాబు నాయుడులతో వరుస ఇంటర్వ్యూలు చేయనుంది.

ఇవి కూడా చదవండి…

పవన్ – బాలయ్య ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు

శ్రీదేవి బయోగ్రఫీ.. జాన్వీ క్లారిటీ

18యేళ్లు..మహేష్ నమ్రత వివాహాబంధం

- Advertisement -