నా ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు- చిరు

309
chiru
- Advertisement -

నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స‌ద్దుల బ‌తుక‌మ్మ పండుగ ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. ఆత్మీయ‌త‌కు అనుబంధానికి అద్దం ప‌ట్టేలా మ‌హిళ‌లంద‌రు బ‌తుక‌మ్మ‌ల‌తో ఓ చోట చేరి ఆట‌పాట‌ల‌తో సంద‌డి చేయ‌నున్నారు. శీతాకాలపు తొలి రోజుల పువ్వులనే దేవుళ్లుగా భావించి పూజించడం తెలంగాణ సాంప్రదాయం. కాగా బతుక‌మ్మ పండుగ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆడప‌డుచులంద‌రికి త‌న ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు.

బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపు కొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొంటున్నాను అని మెగాస్టార్‌ ట్వీట్‌ చేశారు.

- Advertisement -