‘నా పేరు సూర్య’ సెట్లో చిరు..

222
Megastar Chiranjeevi visits the sets of Allu Arjun’s Naa Peru Surya
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య’ ఈ సినిమాతో రచయిత వ‌క్కంతం వంశీ ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆర్మీ నేపధ్యంలో కొసాగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరపుకుంటోంది. తాజాగా అనూ ఇమ్మానియేల్‌పై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

 Megastar Chiranjeevi visits the sets of Allu Arjun’s Naa Peru Surya

ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరింజీవి, అల్లు అరవింద్ ‘నా పేరు సూర్య’ సెట్లో అడుగుపెట్టి సందడి చేశారు. చిత్ర యూనిట్‌తో మెగస్టార్ కాసేపు ముచ్చటించారు. బన్నీ,అనూఇమ్మానియేల్‌పై సాంగ్ చిత్రీకరిస్తుండగా చీరు కాసేపు చూసి ఆనందించారు. ‘‘పాట చిరంజీవికి బాగా నచ్చింది. బన్నీ డ్యాన్స్ చేస్తున్నంతసేపూ.. అలాగే చూస్తుండిపోయారు. చిత్రబృందాన్ని అభినందించి వెళ్లారని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా మె 4న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -