ఇది నా పూర్వజన్మ సుకృతం: చిరంజీవి

71
chiranjeevi
- Advertisement -

సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో నిర్మించిన సమతామూర్తి భారీ విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి సందర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ…భీష్మ ఏకాదశి రోజున అనుకోకుండా ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం అన్నారు.

సమతామూర్తి విగ్రహాన్ని చుశాకనే ఎంత అద్భుతం అనేది అర్థమైందన్నారు.ఆవిష్కరణ రోజు ప్రధాన మంత్రి మోడీ ఇది ప్రపంచంలోని 8వ వింత అంటే ఏదో కష్టపడిన వారికి ప్రశంసలు అనుకున్నాను. కానీ ఇప్పుడు చూశాక అదే మాటను వెంకయ్య నాయుడు నొక్కివక్కాణించడం అక్షర సత్యం అన్నారు.

- Advertisement -