మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్…

175
chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఆచార్య సినిమా షూటింగ్ కోసం తాజాగా టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని తెలిపారు చిరు. ప్ర‌స్తుతం త‌న‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని, హోం క్వారంటైన్‌లో ఉన్న‌ట్టు పేర్కొన్నారు.

తనతో గత ఐదు రోజులుగా కాంటాక్ట్ అయిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపిన చిరంజీవి…తన ఆరోగ్యం గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తానని తెలిపారు చిరు.

వాస్తవానికి కరోనా లాక్ డౌన్ తర్వాత ఆచార్య షూటింగ్ ప్రారంభం అయినా చిరంజీవి మాత్రం పాల్గొనలేదు. ఇక ఈ నెల 9 రేపటి నుండి జరిగే రెగ్యులర్ షూటింగ్‌లో చిరు పాల్గొనాల్సి ఉండగా కరోనాతో వాయిదాపడింది.

- Advertisement -