మెగా ఫ్యామిలీలోకి మ‌రో యువ‌రాణి ఎంట్రీ..

258
srija pregnet
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మ‌రోసారి తాత అయ్యారు. చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ క‌ళ్యాణ్ దేవ్ దంప‌తుల‌కు ఆడ‌శిశువు జ‌న్మించింది. శ్రీజ భ‌ర్త క‌ళ్యాణ్ దేవ్ త‌న ఆనందాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. 2018 క్రిస్మస్ తన జీవితాంతం గుర్తుండి పోతుందని, ఈరోజు ఉదయం తమకు అమ్మాయి జన్మించిందని, మీ అందరికీ సూపర్ మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కల్యాణ్ దేవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ తో పాటు పాప పాద ముద్ర ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు.

kalyan dev

మెగా కుటుంబంలోకి మ‌రో కొత్త వ్య‌క్తి వ‌చ్చిన విష‌యం తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తూ విషెస్ తెలుపుతున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ భార్యకు అన్నా లెజినోవాకు కొడుకు పుట్టిన విష‌యం తెలిసిందే. విజేత’ చిత్రంతో హీరోగా పరిచయమైన కళ్యాణ్ ప్రస్తుతం తన రెండో సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాకి పులివాసు దర్శకత్వం వహించబోతున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందించనున్నారు.

- Advertisement -