కరోనా మహమ్మారిని కడతేర్చడానికి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల సేవలను కేంద్రం ప్రశంసిస్తూ.. గగనతలం నుంచి హెలికాఫ్టర్ల ద్వారా వారిపై పూల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు.
సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులపై పోరాడి దేశాన్ని కాపాడే వీర సైనికులు, కనిపించని వైరస్ అందరిపై దాడి చేస్తుంటే, అహర్నిశలు మనల్ని కాపాడేందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టి ముందు వరుసలో ఉండి పోరాడుతున్న యోథులకు పుష్పాభివందనం చేయడం అభినందనీయమని ప్రశంసించారు. కరోనా పై పోరాడుతున్న వారికి, వీర సైనికులకు తాము రుణపడి ఉన్నామని ప్రశంసిస్తూ చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదుల పైన పోరాడి, దేశాన్ని కాపాడే వీర సైనికులు, కనిపించని వైరస్ అందరిపైన దాడి చేస్తుంటే, అహర్నిశం మనల్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న frontline warriors కి పుష్పాభివందనం చేయటం అభినందనీయం.We are indebted to you both!Jai Hind! #TrueHeroes pic.twitter.com/cFZ1dTg2GT
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 3, 2020