గానకోకిలకు మెగాస్టార్ చిరంజీవి ఘన నివాళి..

64
- Advertisement -

గానకోకిల, భారత రత్న లతా మంగేష్కర్ ఆదివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం తెలియచేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి లతా మంగేష్కర్‌కు ఘననివాళులర్పించారు. ‘భారత సినీ గానకోకిల, ది గ్రేటెస్ట్ లెజెండ్ లతా మంగేష్కర్ ఇక లేరు. నిజంగా ఇది గుండెబద్దలయ్యే వార్త. ఆవిడ లేని లోటు తీర్చలేనిది. ఆమె అసాధారణమైన జీవితం గడిపారు. ఆవిడ గానం సజీవం. సంగీతం ఉన్నంత వరకూ ఆ గాన మాధుర్యం ఎన్నటికీ నిలిచే ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

- Advertisement -