మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే వేసవిలో ఈసినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈమూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా మారిన విషయం తెలిసిందే. ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలను నిర్మించాడు. సైరా సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈసినిమాకు కూడా చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడని సమాచారం. ఇది కూడా భారీ బడ్జెట్ మూవీ కావడం వలన, కొరటాల సన్నిహితుడు సహ నిర్మాతగా ఉంటాడని చెప్పుకుంటున్నారు. సంక్రాంతి తరువాత ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. చిరంజీవి బామ్మర్ది అయిన అల్లు అరవింద్ ఆయనతో సినిమా చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. చిరంజీవితో గీతా ఆర్ట్స్ లో ఒక్క సినిమా అయిన చేయించాలని చూస్తున్నారు అల్లు అరవింద్. ఈ విషయాన్ని ఆయన పలు వేదికల మీద కూడా చెప్పిన విషయం తెలసిందే.