మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహరెడ్డి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈమూవీ తర్వాత చిరంజీవితో కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడని తెలిసిందే. ఈచిత్రం సంక్రాంతి తర్వాత నుంచి ప్రారంభం కానుందని తెలుస్తుంది. ప్రస్తుతం దర్శకుడు కొరటాల స్ర్కీప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు.
ఈమూవీని కూడా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీలోనే రామ్ చరణ్ నిర్మించనున్నాడని సమాచారం. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం మరో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చిరంజీవితో చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటివలే త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవికి కథను వినిపించాడట. దీంతో ఆయనకు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలీం నగర్ వర్గాల సమాచారం.
కొరటాల తర్వాత చిరు చేయబోయేది త్రివిక్రమ్ తోనేని వార్తలు వస్తున్నాయి. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించనున్నారని టాక్. కొరటాల శివతో సినిమా పూర్తయ్యేలోపు త్రివిక్రమ్ బన్నీతో సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్ తర్వాత మాస్ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఒకే సారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్.