మైత్రి సొమ్ముతో ‘వీరయ్య’ విహారం

122
- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి , బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’ వచ్చే సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెల్సిందే. జనవరి 15న సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఇంకా రెండు సాంగ్స్ షూట్ బ్యాలెన్స్ ఉంది. దీని కోసం చిరంజీవి , శృతి హాసన్ యూరప్ ప్రయాణమయ్యారు. అయితే సినిమా టీంతో పాటు చిరంజీవి ఫ్యామిలీ కూడా యూరప్ వెళ్తున్నారు.

“ఫ్యామిలీ తో అటు విహార యాత్ర హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర ” అంటూ స్వయంగా చిరు శృతి హాసన్ తో పాటు తన ఫ్యామిలీ పిక్ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో మెగా స్టార్ పై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

నిర్మాత డబ్బుతో ఫ్యామిలీ తో విహార యాత్ర ప్లాన్ చేసుకున్న చిరు అన్నట్టుగా నెటిజన్లు చిరు పోస్ట్ కింద కామెంట్స్ పెడుతున్నారు. సినిమా షూట్ కోసం వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒక స్టార్ హీరో అయి ఉంది నిర్మాతతో ఇలా తన ఫ్యామిలీ కి ఖర్చు పెట్టించడం సమన్యసమేనా ? అంటున్నారు.

ఇక షూటింగ్స్ కి ఫ్యామిలీ ను తీసుకెళ్లడం ఎప్పటి నుండో వస్తుంది.

స్టార్ హీరోలంతా సమ్మర్ లో షూటింగ్ పెట్టుకొని విదేశాలకు తమ ఫ్యామిలీను కూడా నిర్మాత ఖర్చుతో ట్రిప్ కి తీసుకెళతారు. అయితే అప్పుడు సోషల్ మీడియా లేదు. నిర్మాత తరుపున ఆ ప్రశ్న అడిగేవారు లేరు. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఎవరైనా దేన్నైన్నానేరుగా ప్రశ్నిస్తున్నారు. సో సినిమా షూట్ కోసం యూరప్ బయలుదేరిన వీరయ్య అక్కడ షూటింగ్ గ్యాప్ లో కుటుంబంతో కలిసి టైం స్పెండ్ చేయనున్నాడు.

ఇవి కూడా చదవండి…

దిల్ రాజుతో మైత్రి కి చెడిందా?

నాడు కిడ్స్‌..నేడు స్టార్స్‌….

గిల్డ్ మీటింగ్…అట్టర్ ఫ్లాప్

- Advertisement -