సాధారణ నటుడి స్థాయి నుంచి ‘స్వయంకృషి’తో అగ్ర కథానాయకుడిగా ఎదిగారు చిరంజీవి. అందుకే ఆయన అభిమానులు ఆరాధించే ‘మెగాస్టార్’ అయ్యారు. చిరు ప్రోత్సాహంతోనే ఆయన సోదరులు నాగబాబు, పవన్‌కల్యాణ్ తమదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. దాదాపు 8 ఏళ్ల తరువాత మొఖానికి రంగేసుకున్న మెగాస్టార్ చిరంజీవి…ప్రస్తుతం సైరా సినిమాలో నటిస్తున్నారు.
ఇక మెగాస్టార్ ఇంట్లో ఏ చిన్న పండగ వచ్చినా అంతా ఒకేచోట కలిసి ఎంజాయ్ చేయటం ఆనవాయితీ. తాజాగా మెగాస్టార్ ఫ్యామిలీలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్, కళ్యాణ్ దేవ్‌లతో పాటు మెగా ఫ్యామిలీకి సంబంధించిన సభ్యులు హాజరయ్యారు.
Mega Diwali
#RamCharan pic.twitter.com/BvtFdIRdfa
— Team RamCharan (@AlwayzRamCharan) November 8, 2018
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి హల్ చల్ చేస్తున్నాయి. ఇక మెగాస్టార్‌ని మధ్యలో ఉంచి మెగాడాటర్స్ దిగిన ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే దీపావళి సెలబ్రేషన్స్‌లో పవన్ కళ్యాణ్ లేని లోటు స్పష్ఠంగా కనిపించింది.