సంచ‌ల‌నం సృష్టించిన స‌ర్కార్..

256
vijay_sarkar
- Advertisement -

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన సినిమా స‌ర్కార్ దీపావ‌ళి కానుక‌గా విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టించింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్ మురుగ‌దాస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా, క‌థానాయిక‌గా కీర్తి సురేష్ న‌టించింది. ఎ.ఆర్ రెహ‌మాన్ సంగీతం అందించారు. ఈమూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లై బాక్సాఫిస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వర్షం కురిపిస్తోంది.

vijay sarkar movie

పూర్తిగా పొలిటిక‌ల్ డ్రామా నేప‌ధ్యంలో తెరకెక్కిన ఈసినిమా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది.తొలి రోజు నుంచే ఈమూవీ పై పాజిటివ్ టాక్ రావ‌డంతో కలెక్ష‌న్ల‌ప‌రంగా దూసుకుపోతుంది. మొద‌టి రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 56.90కోట్ల గ్రాస్ ను వ‌సూలు చేసింది.

sarkar movie

రెండవ రోజు కూడా అదే జోరు కంటిన్యూ అవ‌డంతో 110కోట్ల వ‌రకూ రాబ‌ట్టింది. ర‌జ‌నీకాంత్ న‌టించిన కాలా సినిమా రికార్డుల‌ను స‌ర్కార్ అధిగ‌మించ‌డం విశేషం. ఈ వారం చివ‌రి వ‌ర‌కూ 200కోట్ల క్ల‌బ్ లోకి చేరిపోయే అవ‌కాశాలున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు స‌నీ వ‌ర్గాలు.

- Advertisement -