ఇండస్ట్రీలో ఆ స్థానం నాకొద్దు.. చిరు సంచలన వ్యాఖ్యలు..

67
- Advertisement -

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, యోద డయాగ్నస్టిక్స్ ఆధ్వర్యంలో సినీ పరిశ్రమలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు లైఫ్ టైమ్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవీ ముఖ్య అథితిగా పాల్గొని హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిరు సంచలన వ్యాఖ్యలు చేశారు.. సినిమా ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. పెద్దరికం పదవి నాకొద్దు.. ఆ స్థానమే నాకొద్దు.. ఆపదలో ఉంటే మాత్రం ఎవరినైనా తప్పకుండా ఆదుకుంటా” అని చిరు తెలిపారు.

కరోనాతో ఎంతోమంది సినీ కార్మిక కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని.. అలాంటివారికి ఏదైనా చేయాలన్నదే తన తాపత్రయమన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల సభ్యుల కుటుంబాలకు యోధా డయాగ్నిస్టిక్స్‌ ల్యాబ్స్‌లో టెస్టులు, చికిత్సకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన కోరిక మేరకు వెంటనే అంగీకరించిన యోధా డయాగ్నస్టిక్‌ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పటిదాకా ఆరేడు వేల మందికి కార్డులను అందజేశామని, మిగతా వారికి దశలవారీగా అందజేస్తామని చెప్పారు. సంక్రాంతి నాటికి అందరికీ హెల్త్ కార్డులివ్వాలని టార్గెట్ పెట్టారని, టార్గెట్ టైంకు అది పూర్తికాకపోయినా ఈ నెలాఖరునాటికి కార్మికులకు డయాగ్నస్టిక్స్ హెల్త్ కార్డులను జారీ చేస్తామని చిరు పేర్కొన్నారు.

- Advertisement -