మంత్రి కాళ్లు మొక్కిన ఐఏఎస్ అధికారి.. వైరల్

25

విజయనగరం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో వివాదస్పదం చోటు చేసుకుంది.. ఓ ఐఏఎస్ ఆఫీసర్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లను మొక్కడం సంచలనంగా మారింది. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ మంత్రి బొత్సకు వంగి పాదాలకు నమస్కారం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి అయిన బొత్సకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే క్రమంలో కిశోర్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కాళ్లకు మొక్కారు. దీంతో ఒక ఐఏఎస్ అధికారి ఈ రకంగా ప్రవర్తించడం సబబుగా లేదని సోషల్ మీడీయాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.