ద్విపాత్రాభియ‌నంలో మెగాస్టార్..

234
chiranjeevi
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా షూటింగ్ బిజీగా ఉన్నారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌మోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిథ క‌థ ఆధారంగా ఈసినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈమూవీకి ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ హైద‌రాబాద్ శివార్ల‌లో ప్ర‌త్యేకంగా వేసిన ఓ సెట్లో షూటింగ్ జ‌రుపుకుటుంది. 40రోజ‌ల పాటు ఈసెట్లో షూటింగ్ జ‌రుప‌నున్నారు.

Sairaa-Narasimha-Reddy

ఈసినిమాలో బాలీవుడ్ న‌టుడు బిగ్ బి అమితాజ్, త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి, హీరోయిన్ గా న‌య‌న‌తార న‌టిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కూ 30 శాతం వ‌ర‌కూ ఈమూవీ చిత్ర‌క‌ర‌ణ పూర్త‌యింది. గ‌త కొద్ది రోజులుగా ప‌డుతున్న వ‌ర్షాల కార‌ణంగా ఈసినిమా షూటింగ్ కొద్ది రోజులు నిలిపేసిన‌ట్టు స‌మాచారం. ఇక ఈసినిమా వ‌చ్చే ఏడాది వేసవిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.

Megastar-Chiranjeevi-Next-M

ఇక చిరంజీవి త‌న త‌ర్వాతి సినిమా ఎవ‌రితో చేస్తాడా అనే ఆలోచ‌న అభిమానుల్లో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న స‌మాచారం ప్ర‌కారం కొర‌టాల శివతో చిరంజీవి ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన స్ర్కీప్ట్ వ‌ర్క్ ను తీర్చిదిద్దే ప‌నిలో ఉన్నాడు కొర‌టాల శివ‌. అయితే ఈమూవీలో చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. అయితే ఈసినిమా ఎప్పుడు ప్రారంభిస్తార‌నే విష‌యం పై ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వ‌లేదు చిత్ర‌బృందం.

- Advertisement -