వచ్చే యేడాది భోళా శంకర్‌ !

75
megastar
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో మళ్లీ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమయ్యారు. ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను ఓకే చేస్తూ… మంచి ఊపులో ఉన్నారు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ మూవీలో చిరు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే ఊపులో మరోక సినిమాను కూడా అనౌన్స్‌ చేశారు. మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. రిలీజ్ డేట్ ను కూడా మూవీ మేకర్స్ విడుదల చేశారు.

భోళా శంకర్‌ టైటిల్‌ తో మెగాస్టార్‌ ప్రేక్షకులను కనువిందు చేయడానికి వచ్చే యేడాది ఏప్రిల్‌ 14న థియేటర్లలోకి రానుందని మూవీ మేకర్స్‌ వెల్లడించారు. వచ్చే వేసవి కాలానికి చాలా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నా… వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు చిరు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా తమిళంలో వచ్చిన వేదాలంకి రిమేక్‌ గా తెరకెక్కుతుంది ఈ భోళా శంకర్‌.

- Advertisement -