మెగాస్టార్ చిరంజీవి ఎప్పటినుంచి తీయాలి అనుకుంటున్న తన 150వ సినిమా ఎట్టకేలకు తీసేసారు. ‘ఖైదీ నెంబర్ 150’ సంక్రాంతి సందర్భంగా జనవరి 11న రిలీజ్‌కు సిద్ధమైంది ఇప్పటికే ఈసినిమాపై భారీ అంచనలు కూడా వ్యక్తమవుతున్నాయి. దాదాపు తొమ్మిది సంవత్సరల తర్వాత మెగాస్టార్ టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈసినిమాపై ఇప్పటికే ఎన్నో వివాదాలు,రూమర్లుకూడా చుట్టుముడుతున్నాయి. ఇక ఇదే సంక్రాంతి బరిలో బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి కూడా రేసులో ఉంది.
ఈసంగతి ఇలా ఉంటే… చిరంజీవి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌పై కొంచెం టెన్షన్‌కు గురవుతున్నాడట. ఈ వేడుకకు పవన్ కళ్యాన్ వస్తాడా రాడా? పవన్ రాకపోతే పవన్ అభిమానులు ఊరుకోరు….పవన్ పేరుతో నినాదాలు చేసి ఆడియో ఫంక్షన్‌లో ఎవర్ని మాట్లాడన్వికుండా చిరాకు తెప్పిస్తారు అని చిరంజీవి అనుకుంటున్నాడట. గతంలో పవన్ రాని ఫంక్షన్లకు హాజరైనా మెగాస్టార్,రాంచరణ్,అల్లుఅర్జున్,వరుణ్‌తేజ్,నాగబాబు లు ఈ సమస్యను గతంలో అందురు ఎదుర్కొన్నవారే.
చిరంజీవి 60వ బర్త్‌డే వేడుకల్లో నాగబాబు మాట్లాడతున్నప్పుడు పవన్ ఫ్యాన్స్…. పవర్‌స్టార్… పవర్‌స్టార్ అంటూ నినాదాలు చేసారు. అప్పుడు వాళ్లకి నాగబాబు క్లాస్ తీసుకున్నారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఒకవేళ ఈ ఫంక్షన్‌కు పవర్‌స్టార్ హాజరుకాకపోతే ఆ సమస్య మళ్లీ ఎదురవుతుందని. అందుకే ముందు జాగ్రత్తగా మెగా అభిమానులకు పవన్ రాడనే సంకేతాలను ఇస్తున్నారట అల్లుఅరవింద్,రాంచరణ్‌లు….పవన్ ఇండియాలో ఉంటే ఖైదీనెం150 ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు తప్పకుండా వస్తాడని,కానీ ఆయనకు ఆసమయానికి బిజీ షెడ్యూల్స్ ఉన్నాయని అరవింద్ చెప్పాడు. దీనిపై చరణ్ కూడా స్పందింస్తూ బాబాయ్‌కు ఇన్విటేషన్ ఇవ్వడం నా బాధ్యత ఆయనేం చిన్నపిల్లాడు కాదు. రావాలో వద్దో ఆయనే నిర్ణయించుకుంటారని చరణ్ ఘాటుగా స్పందించాడు.
ఈ వేడుకకు పవన్ హాజరుకాకపోతే సమస్య ఎలా ఉంటుందో అనే దానిపై ఫిల్మ్‌నగర్‌లో రకరకల వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ రాకపోతే ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో పవన్ ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేయడం ఎవరివల్ల కాదు అని చిరంజీవి భావిస్తున్నాడట. నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అనే పవన్ డైలాగ్ నిజమేనన్ని పలువురు నేటిజన్లు కామెంట్లు విస్తురుతున్నారు. మొత్తం మీద ఈ వేడుకకు పవన్ హాజరవుతాడో లేదో తెలియాలంటే వేడుక జరిగే అంత వరకు వేచిచూడాల్సిందే.