గబ్బర్ సింగ్ దర్శకుడితో రామ్ చరణ్ మూవీ?

604
Ram Charan
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు. ఈమూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోయిలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీ వచ్చే ఏడాది జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ తో పాటు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీత్, తమిళ దర్శకుడు అట్లీకుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ఇక మరోవైపు రామ్ చరణ్ కూడా తన తర్వాతి మూవీని ప్రకటించలేదు. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ గబ్బర్ సింగ్ దర్శకుడు హరీశ్ శంకర్ తో సినిమా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటివలే హరీశ్ శంకర్ రామ్ చరణ్ కు కథ వినిపించాడని..ఈ కథ చరణ్‌ కు నచ్చడంతో పూర్తి స్క్రీప్ట్ రెడీ చేయమని చెప్పినట్లు తెలుస్తుంది. కాగా హరీశ్ శంకర్ కు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాన్‌, వరుణ్ తేజ్ తో సినిమాలు చేశాడు. త్వరలోనే ఈవిషయంపై క్లారిటి రానుంది.

- Advertisement -