- Advertisement -
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస హిట్లను అందుకుని జోరుమీదున్న మెగా హీరో వరుణ్‌తేజ్. ఆయన కథనాయకుడిగా సంకల్స్రెడ్డి దర్శకత్వంలో వరుణ్ నటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఈ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో కథానాయికలు లావణ్య త్రిపాఠి, అదితీరావు పాల్గొన్నారు.
‘ఘాజీ’ సినిమా విన్నూత్నంగా ఉండటంతొ ప్రసంశలందుకోటంతో పాటు జాతీయ అవార్డును సైతం అందుకుంది. ఈ సినిమాను కూడా స్పేస్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సంకల్ప్‌రెడ్డి. ఈ చిత్రానికి సంబంధించి సెట్‌ను హైదరాబాద్‌లోనే వేయనున్నారట. తెలుగులో ఇప్పటి వరకు స్పేస్ బ్యాక్ డ్రాప్లో చిత్రాలు రాకపోవడంతో ఈ సినిమాపై అంచనాలు మిన్నంటాయి. కాగా ‘కంచె’ లాంటి విన్నూత్న సినిమాలు చేసి హిట్‌ను సాధించి మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు వరుణ్.
- Advertisement -