మహానటి…మూగ మనసులు

298
Mahanati First Single tommrow
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్న నటి సావిత్రి. ఎన్టీఆర్, ఏన్నాఆర్, ఎస్వీఆర్, వంటి నటశిఖరాలతో ఆమె చేసిన పాత్రలు ఈనాటి సినీ ప్రేక్షకుల గుండెళ్లో ఇప్పటికి మెదులుతున్నాయి. తెలుగు పరిశ్రమలో మహానటీగా పేరుతెచ్చుకున్నారు సావిత్రి. ఆమె జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ మహానటి చిత్రాన్ని తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రేపు మహానటి లవ్ సాంగ్‌ని విడుదల చేయనున్నారు. మూగ మనసులు అంటూ మొదలయ్యే ఈ సాంగ్ అందరిని అలరిస్తుందని చిత్రయూనిట్ పోస్టర్‌ని విడుదల చేసింది.

నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్-స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె చిత్రీకరణ పూర్తి చేసుకొంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్‌తో పాటు సమంత, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ కీలకపాత్రల్లో నటించారు.

ఇక ఈ సినిమా టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అనగనగా ఒక మహానటి అంటూ ప్రారంభమయ్యే టీజర్‌ నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ప్రొడక్షన్ డిజైన్: శివం, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, సినిమాటోగ్రఫీ: డాని, ఆర్ట్ సూపర్విజన్: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, నిర్మాత: ప్రియాంక దత్, దర్శకత్వం: నాగఅశ్విన్.

mahanati

- Advertisement -