సైయెంట్ సంస్థ ఆధ్వర్యంలో మెగా ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్..

153
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46 లోని జీహెచ్‌ఎంసీ అర్బన్ ఫారెస్ట్ డివిజన్ పార్క్‌ను అభివృద్ధి చేసింది సైయెంట్ సంస్థ. సైయెంట్ సంస్థ ఆధ్వర్యంలో మెగా ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్,సైయెంట్ సంస్థ ఫౌండర్ బివిఆర్ మోహన్ రెడ్డి,జేసీ ప్రావీణ్య తదితరులు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా సైయెంట్ సంస్థ ఫౌండర్ బివిఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సైయెంట్ సంస్థ 10 వేల మొక్కలు నాటాలని అనుకున్నము. ఇందులో భాగంగా ఈరోజు ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి 3 వేల మొక్కలు నాటామని తెలిపారు. గ్రినరీ పెంచేందుకు గ్రీన్ ఇండియా దిశగా బృహత్కర కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి పని చేస్తాం..రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల నుండి తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుంది..గ్రినరీ ఎంతో పెరిగిందని అన్నారు.

రాబోయే రోజుల్లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్వర్యంలో సైయంట్ సంస్థ తరుపున ఒక కోటి మొక్కలు నాటాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సైయంట్ చైర్మన్ బివిఆర్‌ మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు పురస్కరించుకొని చేపట్టిన ముక్కోటి వృక్ష అర్చనలో మా సంస్థ తరపున 10 వేల మొక్కలు నాటడం జరుగుతుందని ఆయన తెలిపారు.

- Advertisement -