గుడ్ న్యూస్ చెప్పిన చిరు

227
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ తండ్రిని మించే స్థాయికి చేరుకుంటున్నాడు. నటుడిగా చరణ్ ఇప్పటికే మగధీర , రంగస్థలం , RRR లతో రికార్డులు తిరగరాశాడు. కానీ చరణ్ విషయంలో మెగా ఫ్యామిలీ కి అలాగే ఫ్యాన్స్ కి ఓ లోటు ఉండిపోయింది. చరణ్ -ఉపాసన లు ఎప్పుడెప్పుడు పిల్లలని కంటారా ? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పాడు చిరంజీవి.

హనుమాన్ ఆశీస్సులతో చరణ్ – ఉపాసన మొదటి సంతానం కనబోతున్నారని చెప్తూ ఓ పోస్ట్ పెట్టారు చిరంజీవి. దీంతో మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందింది. నిజానికి ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , చరణ్ ఆల్మోస్ట్ ఒకే టైంలో పెళ్లి చేసుకున్నారు. ఎన్టీఆర్ , బన్నీ పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. కానీ చరణ్ కి మాత్రం ఇంకా పిల్లలు లేరనే బాధ ఇటు మెగా కుటుంబంలోనూ అటు అభిమానుల్లోనూ ఉంది. ఇక ఉపాసన గర్బం గురించి కూడా చాలా గాసిప్పులు వచ్చాయి. కానీ ఆమె సద్గురు తో చేసిన కన్వేర్సేషణ్ ఆ రూమర్స్ కి చెక్ పెట్టింది. ఫైనల్ గా చిరు చెప్పిన ఈ గుడ్ న్యూస్ తో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. వారసుస్తుడొన్నాడు అంటూ సంతోషపడుతున్నారు.

ఇవి కూడా చదవండి…

‘పుష్ప 2’.. లీకులేంటి మైత్రి ?

వైరల్ : ఒకే వేదికపై మహేష్ , బన్నీ

వాలెంటైన్స్ నైట్… ట్రైలర్

- Advertisement -