ట్రెండింగ్ లో ‘మెగా ప్రిన్సెస్’

30
- Advertisement -

మెగా ఫ్యామిలీలోకి వారసురాలు వచ్చింది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనలు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. నిన్న రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఉపాసన జాయిన్ కాగా.. ఈ తెల్లవారుజామున అమ్మాయి పుట్టింది. దాంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ మెగా వారసురాలి కోసం ఎం.ఎం కీరవాణి తనయుడు, సింగర్ కాలభైరవ ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించారు.

ఒక స్పెషల్ ట్యూన్ చేసి ఉపాసనకు పంపించారు. ఆ ట్యూన్ పిల్లలు మరియు తల్లిదండ్రుల్లో.. సంతోషం, ఆనందం, పాజిటివ్ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుందని తెలియజేశారు. ఈ ట్యూన్ ని షేర్ చేసిన ఉపాసన కాలభైరవకు థాంక్స్ కూడా చెప్పింది. మరోవైపు ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చిన శుభ సందర్భాన్ని చిరంజీవి ట్విట్టర్‌లో పంచుకుంటూ ఓ పోస్ట్ కూడా పెట్టారు.

Also Read:సొంతగూటికి కోమటిరెడ్డి.. ?

‘లిటిట్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం. నీ రాకతో మెగా ఫ్యామిలీలో నూతన ఉత్సాహం వచ్చింది. తల్లిదండ్రులుగా రామ్‌చరణ్-ఉపాసన, తాతగా నాకు సంతోషం.. గర్వంగా ఉంది.’ అని ట్విట్టర్‌లో మెగాస్టార్ మెసేజ్ చేశారు. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

- Advertisement -