Kamal:భారతీయుడు 2 అదిరే అప్‌డేట్

24
- Advertisement -

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం భారతీయుడు 2. భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాటలో నటి డింపుల్ హయాతితో చేయిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. కమల్ హాసన్ కూడా ఈ సాంగ్ లో ఫుల్ మాస్ స్టెప్స్ వేయబోతున్నారట.

ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా జూన్ నెలాఖరు నాటికి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసే ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. ఈలోగా డబ్బింగ్‌, ఇతర పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

Also Read:సొంతగూటికి కోమటిరెడ్డి.. ?

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ, ప్రియా భవాని శంకర్, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి.

Also Read:ఉదయం లేవగానే ఇలా చేస్తే మంచిది..!

- Advertisement -