హస్కీ బ్యూటీ త్రిష వయసు 39 సంవత్సరాలు. కాబట్టి, వయసు అయిపోయాక కూడా హీరోయిన్ గానే వేస్తా.. స్టార్స్ పక్కనే నటిస్తా అంటే కుదరదు. కానీ, హీరోయిన్ త్రిష మాత్రం అలాగే అంది. మరే ఇతర పాత్రలు వేయను, ఐటమ్ సాంగ్ లు చేయను అని ఇన్నాళ్లు భీష్మించుకొని కూర్చింది. మధ్యలో ఓ స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ వచ్చినా నో చెప్పింది. దీనికితోడు పొన్నియన్ సెల్వన్ సినిమా రూపంలో త్రిషకి క్రేజ్ డబుల్ అయ్యింది. అయితే, గత కొన్ని నెలలుగా టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాల్లో ఒక్క ఛాన్స్ కూడా త్రిషకు రాలేదు. చివరకు ఐటమ్ సాంగ్స్ కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఎలాగూ త్రిష ఫేడ్ అవుట్ అయిపోతున్న పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. అందుకే.. ఇప్పుడు సోలో హీరోయిన్ కలలు నుంచి త్రిష దిగి వచ్చింది.
తెలుగు సినిమాల్లో మళ్లీ స్టార్ హీరోయిన్ గానే బిజీ అవుతా అంటూ బిల్డప్ ఇచ్చిన త్రిష ఇప్పుడు నిర్ణయం మార్చుకుంది. ఆ మధ్య భోళా శంకర్ కోసం ఓ స్పెషల్ సాంగ్ కోసం అడిగితే నో అనేసింది. అలాంటిది ఇప్పుడు ఆ ఐటమ్ సాంగ్ కోసం తెగ తాపత్రయ పడుతుందట. పైగా ఇక నుంచి ఎలాంటి పాత్ర కైనా రెడీ అని దర్శకులకు, నిర్మాతలకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇస్తోన్నట్టు తెలుస్తోంది. చివరకు మెగాస్టార్ చిరంజీవి – మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమాలో ఐటమ్ సాంగ్ లేదా స్పెషల్ సాంగ్ లో త్రిష కనిపించబోతుంది.
మొత్తానికి హీరోయిన్ త్రిష మనసు మార్చుకుని ఐటమ్ సాంగ్ లు చేయడానికి డిసైడ్ అయింది. ఈ విషయంలో మిగిలిన భామలు కూడా త్రిష ను ఆదర్శంగా తీసుకోవాలి. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ లాంటి భారీ చిత్రంలో నటించిన ఏడాది లోపే స్పెషల్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గ్రేట్. అయినా, సాంగ్ కాదు, పాత్ర కాదు, ఏదైనా తమ దగ్గరకు వస్తే.. వదలకుండా ముందుకు సాగడమే ముదురు భామల కెరీర్ కు మంచిది. త్రిష ఇప్పుడు అదే చేసింది.
ఇవి కూడా చదవండి…