అన్నపూర్ణ స్టూడియోలో పవన్‌…

54
- Advertisement -

హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో సినిమాను పవన్‌ కళ్యాణ్‌ పట్టాలెక్కించాడు. సాహో సుజీత్ ఈ సినిమాను దర్శకత్వం వహించనున్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత చెపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి రేపింది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలను అన్నపూర్ణ స్టూడీయోస్‌లో ప్రారంభించారు.

అయితే ఈ కార్యక్రమానికి పవన్‌ గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వడంతో దీన్ని నెట్టింట్లో షేర్ చేశారు సినీమా యూనిట్. ప్రస్తుత వైరల్‌గా మారిన ఈ వీడియోతో సుజీత్ పవన్ కాంబోలో వస్తున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రాజెక్ట్‌ పేరును ఓజీగా అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడిగా ఖారారైనారు.

ఆర్ఆర్ఆర్ ఫేమ్‌ డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈ యేడాది చివర్లో విడుదల చేయాలని భావిస్తున్నారట. మరీ వేచి చూడాలి…వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఈ యేడాది వస్తుందో లేదా వచ్చే యేడాది డిసెంబర్‌ అవుతుందో..

ఇవి కూడా చదవండి…

అమ్మడు మళ్లీ పెళ్లి చేసుకుంటుందట!

రావణాసుర..స్పెషల్ సాంగ్

హరీష్‌పై పవన్ ఫ్యాన్స్ ట్రోల్!

- Advertisement -