సమ్మర్ లో మెగా హీరో “ఉప్పెన” విడుదల

974
panja vaishnav tej uppena
- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. త్వరలోనే మరో హీరో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. మెగా స్టార్ చిరంజీవి చెల్లెలు కొడుకు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఉప్పెన మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈమూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో కలిసి క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కృతికా శెట్టి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈచిత్రాన్ని 2020 ఎప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఈమూవీలో వైష్ణవ్ తేజ్ చేపలు పట్టే కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈమూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

- Advertisement -