రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన జీవితం చాలా మారిపోయిందని చెప్పుకొచ్చారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన తన పర్సనల్ లైఫ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ తల్లిగా తన బిడ్డ కదలికల దగ్గర నుంచి బాగోగులు వరకూ అన్నీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. అలా చూసుకోవాలి అంటే.. కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. నాకు ఆ సహకారం ఎప్పుడూ ఉంది. ముఖ్యంగా పిల్లల పెంపకంలో తనకెప్పుడూ సాయం చేసే భర్త ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నానని ఉపసాన చెప్పారు. ఉపాసన ఇంకా మాట్లాడుతూ.. కూతురు పుడితే.. తండ్రిలో చాలా మార్పులు వస్తాయి అంటారు. కానీ అదేంటో.. నా కూతురు క్లీంకార పుట్టాక నాలో చాలా మార్పులు వచ్చాయి.
క్లీంకార పుట్టిన తర్వాత నా జీవితం ఎంతో మారింది. నాకు నిజంగా నా జీవితం విలువ క్లీంకార తెలియజేసింది అంటూ ఉపాసన ఎమోషనల్ అవుతూ వెల్లడించింది. పైగా తన కూతురు క్లీంకార వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని ఉపాసన చెప్పడం ఆకట్టుకుంది. ఇంతకీ క్లీంకారకి మెగాస్టార్ చిరంజీవి నుంచి ఏ గిఫ్ట్ అందిందో తెలుసా ?, ఆంజనేయ స్వామి పేరు రూపుతో ఉన్న బాంగారు డాలర్స్‌ను అందమైన డిజైన్‌లో తయారు చేయించి.. చిరు తన మనవరాలికి గిఫ్ట్‌గా ఇచ్చారట. మెగా ఫ్యామిలీ మొత్తం హనుమాన్ భక్తులు. ముఖ్యంగా చిరంజీవి హనుమాన్ ను బాగా నమ్ముతారు.
Also Read:ప్రభాస్ కల్కి రిలీజ్ పై క్లారిటీ
అందుకే తన వారసురాలికి తన నమ్మకమైన దేవుడి ప్రతిమను బహూకరించాడు. క్లీంకారకు ఉపాసన ఫ్యామిలీ బంగారు ఊయలను గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక మెగా ప్రిన్సెస్ ఆస్తి వివరాల గురించి ఇప్పటికే అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. మెగా వారసురాలి ఆస్తి విలువ లక్ష కోట్లకు పైమాటే ఉంటుంది. ఇందులో ఉపాసన వాటానే ఎక్కవ ఉంటుంది. ఏది ఏమైనా మెగా వారసురాలు పుడుతూనే సోషల్ మీడియానే షేక్ చేసింది. మెగా ఫ్యాన్స్ కూడా తమ మెగా ప్రిన్సెస్ ఫోటోల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:కూరగాయలను పచ్చిగా తింటే ప్రమాదమా?