నాగబాబు బర్త్ డే…మెగా సందడి..!

529
nagababu
- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు వేడుకలు ఓ స్టార్ హోటల్‌లో ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో తన 58వ పుట్టినరోజును ఘనంగా జరుపుకోగా చిరంజీవి, ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్, నిహారిక, సుస్మిత, శ్రీజ తదితరులు ఈ పార్టీలో సందడి చేశారు.

తన తండ్రి నుదుటిపై ముద్దు పెడుతూ ఐ లవ్‌ యూ నానా అంటూ బర్త్ డే విషెస్ చెప్పింది నిహారిక. ఈ ప్రపంచంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది నువ్వే.. గత జన్మలో ఖచ్చితంగా నా కొడుకుగా పుట్టుంటారు అంటూ తన ప్రేమను చాటుకుంది.

నీ మొహం మీద చిరునవ్వు కోసం మేము ఏదైనా చేస్తాం. ఇంతటి అందమైన జీవితాన్ని అందించినందుకు ధన్యవాదాలు.. నాన్నా లవ్‌ యూ ద మోస్ట్‌’ అంటూ ట్వీట్‌ చేశారు వరుణ్‌. ఇక దీపావళికి కుటుంబసభ్యులతో కలిసి హాజరైన పవన్‌ ఈ వేడుకకు మాత్రం దూరంగా ఉన్నారు.

- Advertisement -