బన్నీ-సుక్కు కాంబోలో కొత్త చిత్రం ప్రాంభం..

390

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. వరుసగా సినిమాలు దూసుకుపోతున్నాడు. అల్లు అర్జున్ 20వ చిత్రం ఈ రోజు ప్రారంభమైంది. ఈ చిత్రం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. ర‌ష్మిక మంథాన క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నాడు. ఈ చిత్రం అతి త్వర‌లోనే సెట్స్‌పైకి వెళ్ళ‌నుంది.

aa20

ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొర‌టాల శివ‌, సురేంద‌ర్ రెడ్డి, అల్లు అర‌వింద్ త‌దిత‌రులు పాల్గొన్నారు. సురేంద‌ర్ రెడ్డి స్క్రిప్ట్ అందించ‌గా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్‌ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తైయిన ఈ సినిమా డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తి కానుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.