మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు..

724
- Advertisement -

సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో కొత్త కాంతులు తీసుకువస్తుంది. భోగి పండుగ నుంచి కనుమ వరకు ఆ సందోహం అంతాఇంతా కాదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సంక్రాంతి సంబరాలు జరుపుకోనివారంటూ ఉండరు. ఇప్పుడు మెగా ఇంట కూడా సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. మెగాస్టార్ చిరంజీవి త‌న ఫ్యామిలీతో క‌లిసి సంక్రాంతి పండుగ‌ని ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్, కూతురు శ్రీజ‌తో పాటు వారి పిల్ల‌ల‌తో క‌లిసి చిరు పండుగ జ‌రుపుకున్నారు.

megastar

అంతేకాదు చిరంజీవితో సహా మెగా యంగ్‌ హీరోలందరూ ఈ వేడుకలో కనిపించారు. ఇందులో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్,వైష్ణవ్‌ తేజ్‌,కల్యాణ్ దేవ్ ఉన్నారు. పవన్ కల్యాణ్ తనయుడు అకీరా కూడా తన సీనియర్ కుటుంబసభ్యులతో ఫొటోలో దర్శనమిచ్చాడు. కారణం ఏంటోగానీ పవన్‌,నాగబాబులు మాత్రం ఈ వేడుకల్లో కనిపించలేదు. చిరు ఇంట్లో పండుగ‌కి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మెగాస్టార్‌ ప్రస్తుతం కొర‌టాల శివ సినిమాతో బిజీగా ఉన్నారు.

- Advertisement -