విచిత్ర వేషధారణతో భయపెడుతున్న మెగా ఫ్యామిలీ

262
- Advertisement -

విచిత్ర వేషధారణతో మెగా ఫ్యామిలీ భయపెడుతోంది.. ముఖానికి కలర్స్ వేసుకుని.. విచిత్రమైన దుస్తులు ధరించి సందడి చేశారు. ఇంతకీ సంగతేంటని ఆలోచిస్తున్నారా.. “హాలోవీన్” వేడుకల్లో భాగంగా మెగాస్టార్ కుటుంబసభ్యులు తెగ ఎంజాయ్ చేశారు. పాశ్చత్య దేశాల్లో కనిపించే “హాలోవీన్” మన దేశంలో కూడా కనిపిస్తోంది.

సినీ ప్రముఖులు ఇలాంటి పార్టీల్లో పాల్గొండటంతో ఇక సామాన్యులు కూడా ఇలాంటి పార్టీలపై ఆసక్తి చూపుతున్నారు. “హాలోవీన్” వీక్‌ సందర్బంగా చిరంజీవి, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, రాంచరణ్ తేజ్, ఉపాసన, సుస్మిత, శ్రీజ, కళ్యాణ్ దేవ్, నిహారిక తదితరులు వింత మేకప్‌లో మెరిసారు.

2016లో వరుణ్ తేజ్, నిహారికలు దెయ్యాల గెటప్‌లో కనిపించగా.. అల్లు అర్జున్ తనయుడు అయాన్ బ్యాట్ మన్ గెటప్ లో సందడి చేశారు. ఇక ఈ సారి మెగా ఫ్యామిలీ మొత్తం “హాలోవీన్” లో పాల్గొని వివిధ కాస్ట్యూమ్స్‌లో అలరించారు. అయితే.. అయ్యప్ప దీక్షలో ఉన్న రాంచరణ్‌ మేకప్ వేసుకోకుండా సంప్రదాయ దుస్తుల్లో ఫ్యామిలీతో కలిసి ఫోటో దిగాడు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫోటోలు నెట్‌లో వైరల్‌గా మారాయి.

- Advertisement -