ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. ఈ నేపథ్యంలో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం లభించగా ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని మే9 ఆవిష్కరించనున్నారు.
ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్- ఉపాసన దంపతులు, కుమార్తె క్లీన్ కారా, పెంపుడు శునకం రైమ్ లండన్‌కు బయలుదేరినట్లు సమాచారం.
టుస్సాడ్స్ కుటుంబంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నానని చరణ్ అన్నారు. చిన్నప్పుడు మేడమ్ టూస్సాడ్స్ మ్యూజియం చూసినప్పుడు లెజెండ్స్ విగ్రహాలతో ఫొటోలు తీసుకునేవాడినని తెలిపారు. అయితే ఇలా ఒకరోజు అదే మ్యూజియంలో తన విగ్రహం ఏర్పాట్లు చేయడం, తన కెరీర్ తొలి నాళ్లలోనే ఇలా జరగడం ఎన్నడూ ఊహించలేదన్నారు.
Also Read:ఉగ్రదాడి..దేశవ్యాప్తంగా సివిల్ మాక్‌డ్రిల్

