మాజీ మంత్రి కుమారుడి పెళ్లికి మెగా బ్రదర్స్‌..

41
pawan

మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి) , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వధూవరులకు ఆశీర్వాదం అందజచేసిన అనంతరం బుద్ధ ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. మెగా బ్ర‌ద‌ర్స్ రాక‌తో అక్క‌డ సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఈ వేడుక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌య్య చేతిలో చేయి వేసి చిరు న‌వ్వులు చిందిస్తూ క‌నిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

చిరు ప్రస్తుతం గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తుండగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లా నాయ‌క్ తో పాటు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమాల‌తో బిజీగా ఉన్నారు.