మీతో మేము….పెద్దపల్లిలో ఎమ్మెల్యే పర్యటన

85
dasari manohar
- Advertisement -

పెద్దపల్లి పట్టణంలోని అభివృద్ధి పనులను పరిశీలించి, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత ఖచ్చితంగా పాటించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశించారు. మీతో- మేము కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని 19, 20 వార్డుల్లో నిర్మాణమవుతున్న డ్రైనేజీలు, సిసి రోడ్ల ను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత ఖచ్చితంగా పాటించాలని అన్నారు.

వార్డు లో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ నమోదు చేసుకొని మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో లో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -