శ్రీశైలంలో ఎలుగుబంటి కలకలం..

72
bear
- Advertisement -

శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో మరోసారి ఎలుగుబంటి హల్ చల్ చేసింది .ఈ రోజు తెల్లవారుజామున ఫీల్టర్ హౌస్ సెంటర్‌లో ఎలుగుబంటి సంచరించే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.గత వారంలో కూడా రెండు ఎలుగుబంట్లు సున్నిపెంట పరిసరా ప్రాంతాల్లో జనావాసాలు మధ్య సంచరించాయి.

స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు ఎలుగుబంట్లను బంధించి అడవిలో వదిలారు.ఈ రోజు మరోసారి జనావాసాల మధ్యకు ఎలుగుబంటి వచ్చిందన్న సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు …. టపాసులు పేలుస్తూ ఎలుగుబంటిని అడవిలోకి తరిమేశారు.తరచూ ఎలుగుబంట్లు జనావాసాల మధ్యకు రావడం పై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -