మీట్ అండ్ గ్రీట్ విత్… మంచిరెడ్డి కిషన్ రెడ్డి

319
- Advertisement -

పెన్సిల్వేనియా: తెలంగాణ అభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రవాస భారతియుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, ఇబ్రహీంపట్నం నియెజకవర్గంలో ఏర్పాటుకానున్న ఫార్మా కంపెనీలు , పరిశ్రమల అభివృద్ధి గురించి చర్చించారు. దీని వల్ల ఉద్యోగ , ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని తెలిపారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి మంచాల గ్రామానికి చెందిన జంబుల విలాస్ రెడ్డి , సందీప్ రెడ్డి , నరసింహ దొంతి రెడ్డి , కిరణ్ లు కలిసి నియోజకవర్గంలోని సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

Meet and Greet with Manchi Reddy Kishan Reddy

అమెరికా లో ఉన్నా తమ సొంతనియోజకవర్గంలోని పనుల గురించి మెమోరాండం సమర్పించింనదుకు ఎమ్మెల్యే సంతోషాన్ని వ్యక్తం చేశారు. పెండింగ్ పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం మీదుగా నాగార్జున సాగర్‌కి మెట్రో రైల్వే లైన్‌ వచ్చే విధంగా చర్చిస్తున్నట్లు వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా…..రానున్న కాలంలో మంచి మార్పులు వస్తాయని తెలిపారు.

Meet and Greet with Manchi Reddy Kishan Reddy

ప్రవాస భారతీయులు తమ తమ గ్రామాల అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నరసింహ దొంతి రెడ్డి, విలాస్ రెడ్డి , సందీప్ , గంగసాని రాజేశ్వర్ , రాఘవ రెడ్డి , కిరణ్ , రమణ రెడ్డి , వంశీ , శ్రీధర్ గుడాల , రామ్మోహన్ రెడ్డి, టాటా , ప్రదీప్ , వివిధ తెలుగు సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Meet and Greet with Manchi Reddy Kishan Reddy

- Advertisement -