మాజీ ప్రధానితో చిందేసిన మోడీ..

101
modi

ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయిలకు సంబంధి ఓ అరుదైన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీలో మంచి డ్యాన్సర్ ఉన్నారని వెలుగు చూసింది.  గతంలో హోలీ పండగ సందర్భంగా వాజ్‌పేయి..మోడీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సంబరాలు చేసుకున్నారు. ప్రఖ్యాత హిందీ పాట రంగ్‌ బర్సేకు వాజ్‌పేయి హుషారుగా డాన్స్‌ చేస్తున్నట్టుగా ఈ వీడియోలో ఉంది. కార్యకర్తలతో కలసి డాన్స్‌ చేసిన వాజ్‌పేయి.. కాసేపు మోదీ చేయి పట్టుకుని ఇద్దరూ చిందేశారు. ఈ వీడియోలో కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ కూడా ఉన్నారు.

modi

వాజ్‌పేయి, మోదీ కలసి హోలీ పండగను ఏ సంవత్సరం, ఎక్కడ చేసుకున్నారన్న వివరాలు తెలియరాలేదు. ఈ వీడియోలో మోదీ వయసును బట్టి చూస్తే దాదాపు 15 ఏళ్ల క్రితం జరిగి ఉండొచ్చని అంచనా. ఆ సమయంలో మోదీ ఏ హోదాలో ఉన్నారో కచ్చితంగా తెలియదు. వాజ్‌పేయి ప్రధాని హోదాలో ఉండొచ్చు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే 2001లో గుజరాత్‌ ముఖమంత్రిగా తొలిసారి మోదీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత గుజరాత్‌ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన మోదీ.. 2014 లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ప్రధాని అయ్యారు.

 

Atal-Modi Dance on HOLI