Telangana Congress:టీపీసీసీ ప్రక్షాళన!

17
- Advertisement -

టీపీసీసీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు అని తెలిపారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ ఇందిరా భవన్‌లో రాష్ట్ర పరిశీలకుల సమావేశం జరుగగా ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లా సమావేశాలకు బ్లాక్, మండల అధ్యక్షులను ఆహ్వానించాలని సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు, ఏఐసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్లు, జిల్లా స్థాయి సీనియర్ నాయకులను ఆహ్వానించాలి అని చెప్పారు. పార్టీ పటిష్టతకు సంస్థాగత నిర్మాణాల చాలా కీలకం అన్నారు మహేష్.

కాంగ్రెస్ పార్టీకి చాలా చరిత్ర ఉంది… బ్రిటిష్ వాళ్ళతో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. కాంగ్రెస్ పార్టీ విస్తృత భావజాలం ఉన్న పార్టీ అని తెలిపారు మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ జాతీయ పార్టీ జాతీయ స్థాయి ఆలోచనలతో పార్టీ పని చేస్తుంది… కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాలతో నడుస్తుంది. పార్టీ సిద్ధాంత ప్రచారం, సంస్థాగత పటిష్టత గ్రామస్థాయి నుంచి జరగాలి..ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అని మీనాక్షి నటరాజన్ సూచించారు.

Also Read:Pahalgam Attack:ఉగ్రవాదుల ఊహా చిత్రాలు

- Advertisement -