మీనాక్షి చౌదరికి సూపర్ ఛాన్స్ !

390
- Advertisement -

మీనాక్షి చౌదరికి ఓ సూపర్ ఛాన్స్ వచ్చింది. రీసెంట్ గా హిట్ 2 అంటూ కుర్ర కారు హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన ఈ భామ ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ తో రొమాన్స్ కి రెడీ అయింది. ఇంతకీ, ఏ సినిమా అనేగా ?.. కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు. నిజానికి, మీనాక్షి చౌదరి ఇలాంటి భారీ ఛాన్స్ కోసమే ఎప్పటి నుంచో పడిగాపులు కాస్తోంది. వాస్తవానికి మీనాక్షి చౌదరి ఆరంభమే భారీతనంతో మొదలు పెట్టాలని ఆశ పడింది.

కాకపోతే.. మీనాక్షి చౌదరికి క్రేజ్ రాలేదు. అంతలో మీనాక్షి చౌదరికి వచ్చే ఛాన్స్ లను శ్రీలీల, కృతి శెట్టి లాంటి భామలు తన్నుకుపోయారు. ఐతే, తెలుగు మేకర్స్ కి ఎప్పుడూ ఒకే టైప్ భామలు నచ్చరు. కొత్తదనం కోసం వాళ్ళు నిత్యం పరితపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మీనాక్షి చౌదరికి ఛాన్స్ లు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు కురాళ్లకు మీనాక్షి చౌదరి అందాలు గిలిగింతలు పెట్టాయి. అందుకే.. మీనాక్షి చౌదరికి కొరటాల శివ బంఫర్ ఆఫర్ ఇచ్చాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం చిన్న హీరోయిన్ గా మిగిలిపోయిన మీనాక్షి చౌదరికి పాన్ ఇండియా రేంజ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడం అంటే.. విశేషమే.

అయినా, మీనాక్షి చౌదరికి ఏం తక్కువ ?, ఈ భామలో ఫుల్ మ్యాటర్ ఉంది. అన్నిటికి మించి తన అందాలతో థియేటర్స్ ను కుమ్మేయగలదు. పైగా ఎన్టీఆర్ సరసన మీనాక్షి చౌదరి క్రేజీ స్టెప్స్ వేస్తే.. వచ్చే ఆ కిక్కే వేరు. మరి, కొరటాల శివ.. మీనాక్షి చౌదరి కి కాస్త గుర్తింపు ఉన్న పాత్ర ఇచ్చినా.. మిగిలిన స్టార్ల చిత్రాల్లో కూడా మీనాక్షి చౌదరి కి అవ‌కాశాలు క్యూ కడతాయి. మరి అన్ని అనుకున్నట్లు జరిగితే.. అతి త్వరలోనే మోస్ట్ వాంటేడ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేయగలదు. కాకపోతే, మీనాక్షి చౌదరి కు కొరటాల శివ ఏ రేంజ్ క్యారెక్టర్ ఇస్తాడు అన్నదే ? ఇక్కడ క్వశ్చన్ మార్క్.

ఇవి కూడా చదవండి…

మైత్రి సొమ్ముతో ‘వీరయ్య’ విహారం

బాలయ్యతో రామానుజాచార్య మూవీ:కళ్యాణ్

మాజీ భామలకు ప్రేరణగా తమన్నా

- Advertisement -