జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉన్న ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి, సినిమాల్లో హీరోయిన్లకు వస్తున్న మార్పులపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ….ఈ రోజుల్లో హీరోయిన్ల పాత్రలు మరింత బలంగా, అర్థవంతంగా మారాయని అన్నారు. భిన్నమైన పాత్రలు చేయడానికి అవకాశాలు లభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ప్రతి సినిమా తనను కొత్త కోణంలో ప్రేక్షకులకు పరిచయం చేస్తోందని మీనాక్షి పేర్కొన్నారు.
‘అనగనగా ఒక రాజు’ సినిమా తన నటనలో మరో కోణాన్ని బయటకు తీసుకువస్తుందని ఆమె తెలిపారు. ఒక సినిమా ఒప్పుకునే సమయంలో పారితోషికం లేదా ఇతర అంశాల కంటే ముందుగా కథ, తన పాత్ర బలం, అలాగే దర్శకుడి విజన్‌కు తాను అత్యంత ప్రాధాన్యం ఇస్తానని మీనాక్షి స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో కథకు, పాత్రలకు ప్రాధాన్యం పెరుగుతుండటం వల్లే హీరోయిన్లకు మంచి అవకాశాలు వస్తున్నాయని ఆమె అభిప్రాయపడింది.
Also Read:పండగవేళ..మందుబాబులకు షాక్!

