Meenakshi:నా హైటే నా సమస్య!

16
- Advertisement -

ఎక్స్ పోజింగ్, హాట్ షోలతో సర్రున దూసుకువచ్చింది ఇండస్ట్రీలోకి మీనాక్షి చౌదరి. ఎలాగూ పాటలు, డ్యాన్స్ ల్లో అమ్మడు మంచి టాలెంట్ చూపిస్తోంది. ఖిలాడి సినిమా తర్వాత ఆమెకు మంచి పేరు రావడంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సాలిడ్ హిట్ కొట్టింది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి‌తో కలిసి అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్లడించింది.

తన చిన్నతనంలో ఇతరులతో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే కాలేజ్ రోజుల్లోనే నా ఎత్తు 6.2 ఉండేది. ఈ కారణంగా నాతో చాలా మంది డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు అంటూ చెప్పుకొచ్చింది. నిజానికి అప్పట్లో నా ఎత్తు నాకు అతి పెద్ద స‌మ‌స్య. ఆ సమయంలో నాకు చాలా బాధగా కూడా అనిపించేది. ఇక ఆర్మీ ఆఫీసర్‌ అయిన మా నాన్నకు ఆ విషయం గురించి చెప్తే నీ సమస్యను నువ్వే పరీక్షించుకో అని సలహా ఇచ్చారు. దీంతో అందాల పోటీల్లో పాల్గొన్నాను. ఇండ‌స్ట్రీకి వచ్చాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఆఫ‌ర్ స‌ద్వినియోగం చేసుకున్నాను అని వెల్లడించింది.

Also Read:ఈ వారం ఓటీటీ సినిమాలివే!

- Advertisement -