మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు.. కడుపుబ్బా నవ్వించే కామెడీ

321
online news portal
- Advertisement -

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని న‌వంబ‌ర్ 25న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. చిత్ర నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ – “` మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` సినిమా అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌. రెండు గంట‌ల పాటు అహ్లాదాన్ని, అనందాన్నిచ్చే చిత్ర‌మవుతుంది. రీసెంట్‌గా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ పొందింది. సినిమాను న‌వంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.

online news portal
మా నిర్మాణంలో 2017లో మూడు సినిమాలు చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. అందులో నితిన్‌తో సినిమా చేయాల‌ని ముందుగా అనుకున్నాను. అయితే `అఆ` త‌ర్వాత నితిన్ రేంజ్ ఇంకా పెరిగింది. కాబ‌ట్టి త‌న‌తో సినిమా చేయ‌డానికి మంచి క‌థ‌, ద‌ర్శ‌కుడు కావాల‌ని వెయిట్ చేస్తున్నాం. ఈలోపు నితిన్ హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను పూర్తి చేస్తాడు. అలాగే నాగశౌర్య‌తో కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాం. ఈ రెండు సినిమాలకు క‌థ‌లను ఫైన‌లైజ్ చేసి డైరెక్ట‌ర్స్ ఎవ‌ర‌నే విషయాన్ని త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తాం. గోపీచంద్‌ను రీసెంట్‌గా క‌లిస్తే ఓ క‌థ విన‌మ‌న్నారు. క‌థ న‌చ్చితే చేద్దామ‌ని అన్నారు. ఆ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌ర‌నే దానిపై ఆలోచ‌న‌లు చేస్తాం.

నేను ఇంజ‌నీరింగ్ చ‌దివాను, ఓ కంపెనీకి సి.ఇ.వో గా ప‌నిచేస్తున్నాను‌. ఈ కంపెనీ మెయిన్ ఆఫీస్‌ కెన్యాలో ఉంది. ఉగాండా, యు.ఎస్‌లో బ్రాంచీలున్నాయి. మంచి టీం స‌పోర్ట్‌తో బిజినెస్ వ్య‌వ‌హారాల‌ను చూస్తున్నాను. సినిమాలంటే ఆస‌క్తి ఉండ‌టంతో 2007లో టాస్ చిత్రానికి కో ప్రొడ్యూస‌ర్‌గా వ‌ర్క్ చేశాను. 2009లో అధినేత సినిమాను నిర్మించాను. ఏమైంది ఈవేళ‌, ప్యార్‌మే ప‌డిపోయానే, బెంగాల్ టైగ‌ర్ సినిమాల‌ను చేశాను. ఇప్పుడు మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

online news portal

`మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` క‌థ న‌చ్చ‌గానే ఈ సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేస్తే బావుంటుంద‌ని ఆలోచించాం. ఎన్నో విజ‌య‌వంత‌మైన కామెడి చిత్రాల‌ను తెర‌కెక్కించిన స‌త్తిబాబుగారైతే సినిమాను అనుకున్న‌ట్టుగా ప్రెజెంట్ చేయ‌గ‌ల‌ర‌నిపించింది. దాంతో ఆయ‌న్ను క‌లవ‌డం, ఆయ‌న ఒప్పుకోవ‌డం జ‌రిగింది. ఈ చిత్రంలో పృథ్వీ, న‌వీన్‌చంద్ర పాత్ర‌లు నువ్వా నేనా అనేలా ఉంటాయి. ఈ సినిమాలో హీరో ఎవ‌రో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అలాగే ఒక ఐడియాకు కోటీ రూపాయ‌ల‌నే క్యాప్ష‌న్ కూడా ఎందుకు పెట్టామో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. పృథ్వీ, స‌లోని జంట‌గా ఓ భారీ సెట్ వేసి సాంగ్ చేశాం. న‌వీన్‌చంద్ర‌, శృతిసోథీపై అర‌కులో ఓ సాంగ్ చేశాం. మేకింగ్ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించాం.

online news portal

న‌వంబ‌ర్ 25న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం గ్యారంటీగా అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది“ అన్నారు. పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతిసోధి హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రంలో జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్‌, పిల్లా ప్రసాద్‌, గిరి, సన, విద్యుల్లేఖా రామన్‌, మీనా, నేహాంత్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్‌, డైలాగ్స్‌ డెవలప్‌మెంట్‌: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్‌: గౌతమ్‌రాజు, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌.కుమార్‌, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

 

- Advertisement -